యాక్షన్‌కు పూజా సన్నద్ధం

ABN , Publish Date - May 16 , 2024 | 05:24 AM

ప్రస్తుతం బాలీవుడ్‌లో కథానాయికగా తన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు పూజాహెగ్డే. ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘సన్కీ’. సునీల్‌శెట్టి తనయుడు అహాన్‌శెట్టి కథానాయకుడిగా...

యాక్షన్‌కు పూజా సన్నద్ధం

ప్రస్తుతం బాలీవుడ్‌లో కథానాయికగా తన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు పూజాహెగ్డే. ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘సన్కీ’. సునీల్‌శెట్టి తనయుడు అహాన్‌శెట్టి కథానాయకుడిగా నటిస్తున్నారు. అద్నాన్‌ ఏ షేక్‌, యాసిర్‌ ఝా దర్శకత్వం వహిస్తున్నారు. సాజిద్‌ నడియాడ్‌ వాలా నిర్మాత. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 15న ‘సన్కీ’ విడుదలవుతోంది.

జూన్‌ తొలివారంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. క్రికెట్‌, ప్రేమ లాంటి అంశాల చుట్టూ అల్లుకున్న కథలో పోరాట ఘట్టాలు ప్రత్యేకాకర్షణగా నిలవనున్నాయని చిత్రబృందం ప్రకటించింది. ఇంటర్నేషనల్‌ స్టంట్‌ డిజైనర్‌ కేచ ఖంఫక్డీ ఆధ్వర్యంలో పోరాట ఘట్టాలు తెరకెక్కనున్నాయి. అందుకే ‘సన్కీ’ కోసం అహన్‌శెట్టి, పూజాహెగ్డే ఇద్దరూ చెమటోడ్చుతున్నారు. ప్రస్తుతం అహన్‌ క్రికెట్‌ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నారు. అలాగే శరీరాన్ని పాత్రకు తగ్గ ఆకృతికి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఇక పూజాహెగ్డే అయితే ఈ సినిమాలో తన పాత్ర కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు పూజా. పతాక సన్నివేశాల్లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్లు ఈ సినిమాకు హైలెట్‌గా ఉంటాయట. అందుకే నటనకు సంబంధించి ఇప్పటికే ఒక రౌండ్‌ వర్క్‌షాప్‌ కూడా ఆమె పూర్తి చేశారని తెలుస్తోంది. అలాగే జిమ్‌లోనూ తీవ్రమైన శిక్షణ తీసుకుంటున్నారు.

Updated Date - May 16 , 2024 | 05:24 AM