పొలిటికల్‌ సెటైర్‌

ABN , Publish Date - May 04 , 2024 | 05:58 AM

ఓటర్లే వారి ఓటుకు ఓ రేటు నిర్ణయించేసుకుని రాజకీయ నాయకులను ముప్పు తిప్పలు పెట్టే కథాంశంతో రూపొందిన ‘లక్ష్మీ కటాక్షం’ చిత్రం ఈ నెల పదిన విడుదల కానంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హోరు వినిపిస్తుంటే...

పొలిటికల్‌ సెటైర్‌

ఓటర్లే వారి ఓటుకు ఓ రేటు నిర్ణయించేసుకుని రాజకీయ నాయకులను ముప్పు తిప్పలు పెట్టే కథాంశంతో రూపొందిన ‘లక్ష్మీ కటాక్షం’ చిత్రం ఈ నెల పదిన విడుదల కానంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హోరు వినిపిస్తుంటే పొలిటికల్‌ సెటైరికల్‌గా రూపొందిన ‘లక్ష్మీ కటాక్షం’ చిత్రం ఆ ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు విడుదలవుతుండడం గమనార్హం. డ్రామా, హాస్యం కలగలసిన ఈ చిత్రంలో సాయికుమార్‌, వినయ్‌, అరుణ్‌, దీప్తి వర్మ, చరిష్మా శ్రీకర్‌, హరిప్రసాద్‌, సాయికిరణ్‌ ఏడిద తదితరులు నటించారు. యు.శ్రీనివాసుల రెడ్డి, బి.నాగేశ్వరరెడ్డి, వహీద్‌ షేక్‌, కె.పురుషోత్తం రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రచన, దర్శకత్వం: సూర్య.

Updated Date - May 04 , 2024 | 05:58 AM