తుపాకులతో పోలీసు బందీ

ABN , Publish Date - Sep 04 , 2024 | 03:27 AM

సన్ని అఖిల్‌, గిద్దేష్‌ అజయ్‌ ఘోష్‌ తదితరులు నటించిన ‘పోలీస్‌ వారి హెచ్చరిక’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను నటుడు శ్రీకాంత్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

సన్ని అఖిల్‌, గిద్దేష్‌ అజయ్‌ ఘోష్‌ తదితరులు నటించిన ‘పోలీస్‌ వారి హెచ్చరిక’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను నటుడు శ్రీకాంత్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘టైటిల్‌ లాగానే ఫస్ట్‌ లుక్‌ కూడా విభిన్నంగా ఉంది. సాఽధారణంగా ఎవరినైనా తాళ్లతోనూ, సంకెళ్లతోనో బంధిస్తారు. కానీ ఒక పోలీస్‌ను తుపాకులతో కట్టి బంధించడం నిజంగా కొత్తగా ఉంది’ అని అభినందించారు. అభ్యుదయ చిత్రాల దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Updated Date - Sep 04 , 2024 | 03:27 AM