నెగెటివ్‌ ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:57 AM

విజయ్‌దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. కాగా, ఈ సినిమా ఏమాత్రం బాలేదని కొందరు సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ ప్రచారం చేస్తున్నారు...

నెగెటివ్‌ ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు

విజయ్‌దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. కాగా, ఈ సినిమా ఏమాత్రం బాలేదని కొందరు సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాపై ఇలా దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజయ్‌దేవరకొండ పర్సనల్‌ మేనేజర్‌ అనురాగ్‌ పర్వతనేని, ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ నిషాంత్‌కుమార్‌ కలసి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు కావాలనే ఇలా నెగిటివ్‌ ప్రచారం చేయడం వల్ల సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుని విచారించి నిందితులని పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

Updated Date - Apr 08 , 2024 | 12:57 AM