ఏక్తా కపూర్‌పై పోక్సో కేసు

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:22 AM

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత ఏక్తా కపూర్‌పై పోక్సో కేసు నమోదైంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆల్ట్‌ బాలాజీలో ప్రసారమవుతోన్న ‘గంధీ బాత్‌ సీజన్‌-6’కు సంబంధించి ముంబయి పోలీసులు...

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత ఏక్తా కపూర్‌పై పోక్సో కేసు నమోదైంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆల్ట్‌ బాలాజీలో ప్రసారమవుతోన్న ‘గంధీ బాత్‌ సీజన్‌-6’కు సంబంధించి ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సిరీ్‌సను బాలాజీ టెలిఫిల్మ్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై తెరకెక్కించారు. ఇందులో మైనర్‌ బాలికలకు సంబంధించిన అసభ్యకరమైన దృశ్యాలను చూపించారన్న ఆరోపణలతో పోక్సో కింద ఆమెతోపాటు తల్లి శోభా కపూర్‌పై కేసు నమోదైంది. కాగా, ఏక్తాకపూర్‌ ఈ ఏడాది లవ్‌, సెక్స్‌ ఔర్‌ ధోఖా-2 సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

Updated Date - Oct 21 , 2024 | 03:23 AM