వజ్రం లాంటి పింకీ

ABN , Publish Date - Jan 05 , 2024 | 06:51 AM

సుమన్‌, శుభలేఖ సుధాకర్‌, రవి అట్లూరి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘పింకీ’. కిరణ్‌, మౌర్యాణి జంటగా నటించారు. సీరపు రవికుమార్‌ దర్శకత్వంలో...

వజ్రం లాంటి పింకీ

సుమన్‌, శుభలేఖ సుధాకర్‌, రవి అట్లూరి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘పింకీ’. కిరణ్‌, మౌర్యాణి జంటగా నటించారు. సీరపు రవికుమార్‌ దర్శకత్వంలో పసుపులేటి వెంకట రమణ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ‘రవికుమార్‌ చెప్పిన కథ నచ్చి ‘పింకీ’ చిత్రాన్ని నిర్మించాను. దర్శకుడు అన్నీ తానై ఈ చిత్రాన్ని రూపొందించాడు’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇది నా తొలి చిత్రం. మా నిర్మాత ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. డైమండ్‌ కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ‘పింకీ’ కథ సాగుతుంది. ఇదొక సస్పెన్స్‌ థ్రిల్లర్‌’ అని తెలిపారు. దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు అని కిరణ్‌ చెప్పారు.

Updated Date - Jan 05 , 2024 | 06:51 AM