భారీ మొత్తం చెల్లించి...

ABN , Publish Date - Apr 11 , 2024 | 04:42 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా, సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు...

భారీ మొత్తం చెల్లించి...

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా, సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. మిక్కిలినేని సుధాకర్‌, కె హరికృష్ణ నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ అక్టోబర్‌ 10న విడుదలవుతోంది. ఈ సినిమా ఉత్తరాధి థియేట్రికల్‌ రైట్స్‌ను ధర్మ ప్రొడక్షన్స్‌ అధినేత కరణ్‌ జోహార్‌, ఏఏ ఫిల్మ్స్‌ ఫౌండర్‌ అనిల్‌ తడాని భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నారు.

ఈ క్రేజీ డీల్‌తో నార్త్‌లోనూ ‘దేవర’ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని చిత్ర బృందం, అభిమానులు ఆశిస్తున్నారు.

Updated Date - Apr 11 , 2024 | 04:42 AM