పవన్ కల్యాణ్ టైటిల్‌తో
ABN , Publish Date - Oct 19 , 2024 | 06:14 AM
ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ఖరారైంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా
ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ఖరారైంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ టైటిల్‌ను యూనిట్ ఖరారు చేసింది. దీంతో పాటు ఫస్ట్‌లుక్, మోషన్ వీడియోను విడుదల చేశారు. నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పిల్లి కథానాయిక. వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను కీలకపాత్రలు పోషిస్తున్నారు. మాంక్స్ అండ్ మంకీస్ సంస్థ నిర్మిస్తోంది. సంగీతం: రధన్, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాలరెడ్డి.