Pawan kalyan: గెలుపు తర్వాత చిరును కలిసిన పవర్‌స్టార్‌

ABN , Publish Date - Jun 06 , 2024 | 06:06 PM

ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన అధినేత పవన్  కళ్యాణ్  భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే! 

Pawan kalyan:  గెలుపు తర్వాత చిరును కలిసిన పవర్‌స్టార్‌

ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా (Pithapuram Mla) జనసేన అధినేత పవన్  కళ్యాణ్ (Pawan kalyaN) భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే!  21 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాల్లో అఖండ విజయం సాధించిన ఆయన ఢిల్లీ ఎన్డీఎ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌ చేరుకున్న పవన్ కల్యాణ్‌ తన సోదరుడు మెగస్టార్‌ చిరంజీవి దీవెనల కోసం చిరు ఇంటికి చేరుకున్నారు. అన్నయ్యను ఆత్మీయ ఆలింగనం చేసుకుని కాళ్లపై పడి నమస్కరించారు. చిరంజీవి  భావోద్వేగంతో పవన్ ను ఆలింగనం చేసుకున్నాఋ. పూల మాలతో సత్కరించారు. Pks.jpeg

పదేళ్ల కష్టానికి (Janasena) తగ్గ ఫలితం దక్కిందని చిరు కుటుంబ సభ్యులంతా భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

Updated Date - Jun 06 , 2024 | 06:25 PM