మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pat Cummins on Tollywood: నిన్నటివరకూ డేవిడ్ వార్నర్, ఇప్పుడేమో పాట్ కమిన్స్ కూడా అదే బాటలో...

ABN, Publish Date - Apr 24 , 2024 | 11:57 AM

ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కి తెలుగు ప్రేక్షకులలో ఎంతోమంది అభిమానులు వున్నారు, ఎందుకంటే అతను తెలుగు అగ్రనటులను అనుకరిస్తూ చేసిన వీడియోలు. ఇప్పుడు పాట్ కమిన్స్ కూడా అదే బాటలో వెళుతూ కొంతమంది తెలుగు నటులను అనుకరిస్తూ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Pat Cummins and Pawan Kalyan

ఆస్ట్రేలియన్ క్రికెట్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కి తెలుగువాళ్ళతో చాలా దగ్గర అనుబంధం వుంది. ఎందుకంటే అతను సన్ రైజర్స్ హైదరాబాదుకి ఆడేటప్పుడు తెలుగు సినిమా ఆటగాళ్ళని అనుకరించేవాడు. దానితో అతనికి బాగా అభిమానులు పెరిగారు. అతను ఇక అది అలవాటుగా మార్చుకొని ఏ పెద్ద తెలుగు సినిమా విడుదలైన, ఆ సినిమాలో నటుడిని, లేదా పాటని అనుకరించి రీల్స్ చేస్తూ అభిమానులను పెంచుకుంటూ వెళ్ళాడు. 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ పాత్ర చేసిన వ్యవహారశైలి 'తగ్గేదే లే' అనే దానిని అనుకరిస్తూ చేసిన రీల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఆ తరువాత మహేష్ బాబు లాంటి చాలామంది అగ్రనటులను సైతం అనుకరించాడు డేవిడ్ వార్నర్. ఇప్పుడు వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడుతున్నాడు, అయినా తెలుగు నటుల రీల్స్ చేస్తూనే వున్నాడు.

ఇప్పుడు డేవిడ్ వార్నర్ బాటలో ఇంకో ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు పాట్ కమిన్స్ కూడా ముందుకొచ్చాడు. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక వ్యాపారాత్మక ప్రకటన వీడియోలో పాల్గొంటూ మహేష్ బాబు తో కొన్ని ఫోటోలు కూడా తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసాడు పాట్ కమిన్స్. ప్రస్తుత సన్ రైజర్స్ ఐపీఎల్ టీముకి పాట్ కమిన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

అదొక్కటే కాకుండా పాన్ కమిన్స్ ఇప్పుడు తెలుగు అగ్ర నటుల పాపులర్ డైలాగ్స్ చెప్పి అందరినీ అబ్బురపరిచారు. "ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను", "కమ్మిన్స్ అంటే క్లాస్ అనుకున్నావా? మాస్ ఊరమాస్", "SRH అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ" అంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అంతే కాకుండా పవన్ కల్యాణ్ ఎలా డైలాగ్ చెప్తారా అలానే అచ్చం అనుకరిస్తూ చేసి అదరగొట్టాడు. పాట్ కమిన్స్ చేసిన ఈ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్ కమిన్స్ తో ఈ వినూత్న మైన ప్రచారాన్ని చేయించి నిర్వహిస్తోంది.

Updated Date - Apr 24 , 2024 | 11:57 AM