పంతులమ్మ పోరాటం

ABN , Publish Date - Feb 06 , 2024 | 01:15 AM

జ్యోతిక ప్రధాన పాత్ర పోషించిన తమిళ చిత్రం ‘రాక్షసి’ తెలుగులో ‘అమ్మ ఒడి’పేరుతో విడుదలవుతోంది. ఎస్‌ వై గౌతమ్‌రాజ్‌ దర్శకత్వంలో ఎస్‌ ఆర్‌ ప్రకాశ్‌, ఎస్‌ ఆర్‌ ప్రభు నిర్మించారు. నాగినీడు, హరీశ్‌ పేరడి...

పంతులమ్మ పోరాటం

జ్యోతిక ప్రధాన పాత్ర పోషించిన తమిళ చిత్రం ‘రాక్షసి’ తెలుగులో ‘అమ్మ ఒడి’పేరుతో విడుదలవుతోంది. ఎస్‌ వై గౌతమ్‌రాజ్‌ దర్శకత్వంలో ఎస్‌ ఆర్‌ ప్రకాశ్‌, ఎస్‌ ఆర్‌ ప్రభు నిర్మించారు. నాగినీడు, హరీశ్‌ పేరడి, పూర్ణిమ భాగ్యరాజ్‌, సత్యన్‌ కీలకపాత్రలు పోషించారు. సోమవారం చిత్రబృందం ‘అమ్మ ఒడి’ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చే బాధ్యతాయుతమైన టీచర్‌ పాత్రలో జ్యోతిక కనిపించారు. విద్యా వ్యవస్థను నాశనం చేసేవారి పాలిట ఆమె ఓ రాక్షసి అంటూ జ్యోతిక పాత్రను పరిచయం చేయడం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న వడ్డి రామానుజం, వల్లెం శేషారెడ్డి మాట్లాడుతూ ‘‘అమ్మఒడి’ చిత్రం తెలుగులోనూ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. విద్యావ్యవస్థ లోపాలను దర్శకుడు ఎత్తిచూపారు. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామ’న్నారు.

Updated Date - Feb 06 , 2024 | 01:15 AM