పక్కా పండగ సినిమా
ABN, Publish Date - Oct 10 , 2024 | 05:48 AM
గోపీచంద్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘విశ్వం’. శ్రీనువైట్ల దర్శకత్వంలో టీ.జీ.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను...
గోపీచంద్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘విశ్వం’. శ్రీనువైట్ల దర్శకత్వంలో టీ.జీ.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను గోపీచంద్ మీడియాతో పంచుకున్నారు.
‘‘పక్కా పండగ సినిమా ఇది. థియేటర్లు ప్రేక్షకుల నవ్వుల్తో నిండిపోతాయి. ఈ సినిమా అవుట్‌పుట్ అనుకున్నదానికంటే రెండింతలు బాగా వచ్చింది. ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. దేశం ఎదుర్కొంటున్న ఓ కీలక సమస్యను ఇందులో చూపించాం. అదేంటన్నది థియేటర్లలోనే చూడాలి. శ్రీనువైట్లకు ఇది కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతుంది. ఆయన టైమింగ్‌ను అందుకోవడానికి నాకు రెండు రోజులు పట్టింది. నా సినిమాల్లో.. ‘లౌక్యం’ తర్వాత ఆ స్థాయి వినోదం ఇందులోనే ఉంది. సినిమాలో నా పాత్ర పేరు ‘విశ్వం’. ప్రతీ పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్.. ఇలా అన్నీ చక్కగా కుదిరాయి.
కావ్యథాపర్ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఇందులో ఉన్న ట్రైన్ ఎపిసోడ్ గురించే అందరూ మాట్లాడుతున్నారు. ‘వెంకీ’ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ ఎంత వినోదాన్ని ఇచ్చిందో.. ఇందులో అంతకుమించిన వినోదం పండుతుంది. ప్రొడ్యూసర్లు రాజీపడకుండా నిర్మించారు’’ అని చెప్పారు.