పైసా వసూల్‌ సినిమా అవుతుంది

ABN , Publish Date - Apr 21 , 2024 | 04:57 AM

విశాల్‌, ప్రియా భవానీ నటించిన చిత్రం ‘రత్నం’. విశాల్‌తో ‘భరణి’, ‘పూజ’ చిత్రాలు చేసిన డైరెక్టర్‌ హరి ఈ సినిమాను తెరకెక్కించారు. కార్తీకేయన్‌ సంతానం నిర్మించారు...

పైసా వసూల్‌ సినిమా అవుతుంది

విశాల్‌, ప్రియా భవానీ నటించిన చిత్రం ‘రత్నం’. విశాల్‌తో ‘భరణి’, ‘పూజ’ చిత్రాలు చేసిన డైరెక్టర్‌ హరి ఈ సినిమాను తెరకెక్కించారు. కార్తీకేయన్‌ సంతానం నిర్మించారు. ఈ నెల 26న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సంద్భంగా విశాల్‌ మీడియాతో ముచ్చటించారు. ‘‘యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. ఇందులో కేవలం మాస్‌ ఎలిమెంట్స్‌ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు మంచి సంగీతం ఇచ్చారు. ఇందులోని కంటెంట్‌, డైలాగ్స్‌ వల్ల అందరికీ ఇది స్ట్రయిట్‌ తెలుగు సినిమాలాగే అనిపిస్తోండటం సంతోషంగా ఉంది. హరి సినిమాల్లో హీరో పాత్ర కంటే హీరోయిన్‌కే అధిక ప్రాఽముఖ్యతఉంటుంది. ఇందులో ప్రియా భవానీ శంకర్‌ పాత్ర తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు పెట్టే డబ్బులకు సరిపడా వినోదం ఇస్తాం. కచ్చితంగా పైసా వసూల్‌ సినిమా అవుతుంది’’ అని చెప్పారు.

Updated Date - Apr 21 , 2024 | 04:57 AM