జాన్వీతో జంటగా...

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:32 AM

ఒకప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి జంట తెలుగు తెరపై ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. చిరంజీవి, శ్రీదేవిలానే రామ్‌చరణ్‌, జాన్వీకపూర్‌ కలసి నటిస్తే చూడాలనేది మెగా అభిమానుల కోరిక. గతంలో ఒకట్రెండు సందర్భాల్లో...

జాన్వీతో జంటగా...

ఒకప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి జంట తెలుగు తెరపై ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. చిరంజీవి, శ్రీదేవిలానే రామ్‌చరణ్‌, జాన్వీకపూర్‌ కలసి నటిస్తే చూడాలనేది మెగా అభిమానుల కోరిక. గతంలో ఒకట్రెండు సందర్భాల్లో ఈ కాంబినేషన్‌ సెట్‌ చేసేందుకు ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. ఇన్నాళ్లకు ఈ క్రేజీ కాంబినేషన్‌ సెట్టయింది.

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం ( ఆర్‌సీ 16-వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్‌ నటి ంచనున్నారు. ఈ విషయాన్ని జాన్వీ తండ్రి బోనీకపూర్‌ సోమవారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘త్వరలోనే ఆర్‌సీ 16 షూటింగ్‌లో జాన్వీ పాల్గొంటుంది. రామ్‌చరణ్‌ లాంటి హీరోతో నటించడం జాన్వీకి మంచి అవకాశం. నా భార్య శ్రీదేవి లానే నా కూతురు కూడా విభిన్న భాషల్లో నటించి పేరు తెచ్చుకోవాలి’ అని ఆయన ఆకాంక్షించారు. అలాగే తమిళ హీరో సూర్యతోనూ జాన్వీ ఓ చిత్రంలో నటిస్తున్నట్లు బోనీకపూర్‌ చెప్పారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ సరసన జాన్వీకపూర్‌ ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతోనే ఆమె హీరోయిన్‌గా టాలీవుడ్‌ అరంగేట్రం చేస్తున్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘గేమ్‌ఛేంజర్‌’ చిత్రం షూటింగ్‌లో రామ్‌చరణ్‌ పాల్గొంటున్నారు. ఏప్రిల్‌ నుంచి ‘ఆర్‌ సీ 16’ షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

Updated Date - Feb 20 , 2024 | 05:32 AM