జీ2లో ఓజీ విలన్‌

ABN , Publish Date - Feb 16 , 2024 | 05:46 AM

బాలీవుడ్‌లో రొమాంటిక్‌ హీరోగా తనదైన ముద్ర వేసిన ఇమ్రాన్‌ హష్మీ కొన్నాళ్లుగా రూట్‌ మార్చి స్టైలిష్‌ విలన్‌ పాత్రలతో మెప్పిస్తున్నారు. సుజీత్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఓజీ’...

జీ2లో ఓజీ విలన్‌

బాలీవుడ్‌లో రొమాంటిక్‌ హీరోగా తనదైన ముద్ర వేసిన ఇమ్రాన్‌ హష్మీ కొన్నాళ్లుగా రూట్‌ మార్చి స్టైలిష్‌ విలన్‌ పాత్రలతో మెప్పిస్తున్నారు. సుజీత్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఓజీ’ చిత్రంలో ఇమ్రాన్‌ హష్మీ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా మరో టాలీవుడ్‌ చిత్రంలో ఆయన విలన్‌గా కనిపించనున్నారు. అడివిశేష్‌ కథానాయకుడిగా రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘గూఢచారి 2’ (జీ2)లో ఆయన విలన్‌గా నటించనున్నారు. ఈ విషయాన్ని గురువారం అడివిశేష్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ‘గూఢచారి ప్రపంచంలోకి గొప్ప నటుడికి స్వాగతం’ అంటూ ఇమ్రాన్‌ హష్మీ ఫొటోను అడివిశేష్‌ షేర్‌ చేయగా వైరల్‌ అయింది. ‘గూఢచారి 2’లో భాగమవుతున్నందుకు ఆనందంగా ఉందని ఇమ్రాన్‌ పేర్కొన్నారు.

Updated Date - Feb 16 , 2024 | 05:46 AM