సెప్టెంబర్‌లో ఓజీ రాక
ABN , Publish Date - Jan 31 , 2024 | 01:51 AM
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ఇమ్రాన్ హష్మీ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది...
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ఇమ్రాన్ హష్మీ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 27న ‘ఓజీ’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం మంగళవారం ప్రకటించింది. 1950ల నాటి ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సుజీత్ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్‌కల్యాణ్ శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం కూడా సెప్టెంబర్ 27న విడుదలై ఇండ స్ట్రీ హిట్‌గా నిలిచింది.