మా నమ్మకం నిజమైంది

ABN , Publish Date - Jan 30 , 2024 | 05:46 AM

‘సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా మీరు ఎప్పుడూ ప్రేమని పంచుతూనే ఉన్నారు. నేను కనిపించగానే ఆనందంతో నవ్వుతూ ఉంటారు. మీ చిరునవ్వే నాకు ధైర్యం’ అభిమానులను ఉద్దేశించి ‘నా సామిరంగ’ విజయోత్సవంలో నాగార్జున అన్న మాటలివి...

మా నమ్మకం నిజమైంది

‘సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా మీరు ఎప్పుడూ ప్రేమని పంచుతూనే ఉన్నారు. నేను కనిపించగానే ఆనందంతో నవ్వుతూ ఉంటారు. మీ చిరునవ్వే నాకు ధైర్యం’ అభిమానులను ఉద్దేశించి ‘నా సామిరంగ’ విజయోత్సవంలో నాగార్జున అన్న మాటలివి. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా ఆదివారం జరిగిన విజయోత్సవంలో యూనిట్‌ సభ్యులకు నాగార్జున షీల్డ్స్‌ అందించారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా మొదలు పెట్టిన తర్వాత సంక్రాంతికి వస్తుందనే నమ్మకం బయట ఎవరిలోనూ లేదు. కానీ మా టీమ్‌ అందరిలో ఆ నమ్మకం ఉంది. అది నిజమైంది. అనుకున్న సమయానికి చిత్రం పూర్తి కావడానికి సంగీత దర్శకుడు కీరవాణి ప్రధాన కారణం’ అన్నారు. ‘ఫాస్టెస్ట్‌ ప్రాజెక్ట్‌ చేసి విజయం సాధించిన దర్శకుడు విజయ్‌కి అభినందనలు. కొత్త ప్రతిభను నమ్ముతూ ఇంత ఫ్రీడమ్‌ ఇచ్చిన నాగార్జునకు ధన్యవాదాలు. మా మ్యూజిక్‌ టీమ్‌ కూడా చాలా కష్టపడింది’ అని తెలిపారు కీరవాణి. ఒక ఫ్యాన్‌ బాయ్‌ నుంచి కో స్టార్‌ స్టేజ్‌ వరకూ నాగార్జునతో షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉందని నరేశ్‌ చెప్పారు. దర్శకుడు విజయ్‌ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అందరూ తనని ‘వరాలు’ అని పిలవడం ఆనందంగా ఉందని హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌ చెప్పారు.

Updated Date - Jan 30 , 2024 | 05:46 AM