‘ఒసేయ్‌ అరుంధతి’ టైటిల్‌ ట్రాక్‌

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:37 AM

కమల్‌ కామరాజు, మోనికా చౌహాన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఒసేయ్‌ అరుంధతి’. వెన్నెల కిశోర్‌, పృథ్వీరాజ్‌, చిత్రం శ్రీను, అరియానా గ్లోరి, సునీతా మనోహర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు...

‘ఒసేయ్‌ అరుంధతి’ టైటిల్‌ ట్రాక్‌

కమల్‌ కామరాజు, మోనికా చౌహాన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఒసేయ్‌ అరుంధతి’. వెన్నెల కిశోర్‌, పృథ్వీరాజ్‌, చిత్రం శ్రీను, అరియానా గ్లోరి, సునీతా మనోహర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని విక్రాంత్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. గూడూరు ప్రణయ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి టైటిల్‌ ట్రాక్‌ను విడుదల చేశారు. చిత్ర దర్శకుడు విక్రాంత్‌కుమార్‌ ఈ పాటకు లిరిక్స్‌ అందించగా, సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. ఈ సందర్భంగా నిర్మాత గూడూరు ప్రణయ్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని’’ చెప్పారు. చిత్ర దర్శకుడు విక్రాంత్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం’’ అని అన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 06:37 AM