Operation Valentine : ప్రేక్షకులు గర్వపడేలా ఆపరేషన్‌ వాలెంటైన్‌

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:11 AM

వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లర్‌ జంటగా నటించిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ మార్చి ఒకటిన విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సిద్దు ముద్దా, నందకుమార్‌ అబ్బినేని బుధవారం మీడియాతో...

Operation Valentine : ప్రేక్షకులు గర్వపడేలా ఆపరేషన్‌ వాలెంటైన్‌

వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లర్‌ జంటగా నటించిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ మార్చి ఒకటిన విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సిద్దు ముద్దా, నందకుమార్‌ అబ్బినేని బుధవారం మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాలు వెల్లడించారు.

  • దర్శకుడు శక్తి ప్రతాప్‌సింగ్‌ రూపొందించిన షార్ట్‌ ఫిల్మ్‌ మాకు, వరుణ్‌కి బాగా నచ్చింది. దాన్నే ఫుల్‌ లెంగ్త్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా చేయాలనే ప్రయత్నాల్లో దర్శకుడు ఉన్నప్పుడు ఆ కథ విన్నాం. బాగా నచ్చడంతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నాం. సోనీ పిక్చర్స్‌ నిర్మాణ భాగస్వామిగా రావడంతో తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా తీశాం.

  • కొత్త వాడైనా ప్రతాప్‌ సింగ్‌కు మంచి క్లారిటీ ఉంది. సినిమాకు ఏం కావాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. అలాగే తను అదే నేపథ్యం నుంచి వచ్చారు కనుక వీఎఫ్‌ఎక్స్‌ మీద మంచి కమాండ్‌ ఉంది. ‘ఫైటర్‌’ తర్వాత ఇలాంటి భారీ ఎయిర్‌ సీక్వెన్స్‌తో ఇండియాలో వచ్చిన మా చిత్రాన్ని ఆయన చాలా అద్భుతంగా తీశారు. గ్వాలియర్‌ ఎయిర్‌ బేస్‌లో సినిమాను షూట్‌ చేశాం. రియల్‌ ఎయిర్‌ బేస్‌లో షూటింగ్‌ చేయడం ఒక కొత్త అనుభూతి. వాయు సేన సైనికుల త్యాగాలను, ధైర్యాలను స్మరించుకుంటూ వాళ్ల కథని ప్రేక్షకులకు చెప్పాలనే ఆలోచనతో ఈ సినిమా నిర్మించాం.

  • ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు సినిమా చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏం చెప్పారో అదే తీశారని ప్రశంసించారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇలాంటి రియల్‌ హీరోస్‌ సినిమాలు మరిన్ని చేయాలనే స్పూర్తి కలిగింది.

  • అందరి హీరోలతో సినిమాలు తీయాలని ఉంది. నితిన్‌తో ఓ సినిమా అనుకుంటున్నాం. ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ విడుదల తర్వాత చిన్న బ్రేక్‌ తీసుకుని ఆగస్టు నుంచి కొత్త ప్రాజెక్ట్‌పై వర్క్‌ చేస్తాం. ఈసారి ఓ డిఫరెంట్‌ లవ్‌స్టోరీ తీయాలని మా ఆలోచన.

Updated Date - Feb 29 , 2024 | 05:11 AM