ఒక సినిమా.. మూడు అవార్డులు!
ABN , Publish Date - Nov 04 , 2024 | 05:30 AM
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించిన ‘బేబి’ చిత్రానికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. సాయిరాజేశ్ దర్శకత్వంలో ఎస్కేఎన్ ఈ సినిమా నిర్మించారు...
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించిన ‘బేబి’ చిత్రానికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. సాయిరాజేశ్ దర్శకత్వంలో ఎస్కేఎన్ ఈ సినిమా నిర్మించారు. ఇందులోని ‘ఓ రెండు మేఘాలిలా’ పాటకు ఇటీవల ఐఫా అవార్డు అందుకొన్నారు గీత రచయిత అనంత శ్రీరామ్. ఇప్పటివరకూ ‘బేబి’ సినిమాకు ఫిల్మ్‌ఫేర్, సైమా, గామా అవార్డులు లభించాయి. అవార్డులు పొందిన అనంత్ శ్రీరామ్‌ను దర్శక నిర్మాతలు అభినందించారు.