ఒక సినిమా... ఐదు అవార్డులు

ABN , Publish Date - Aug 06 , 2024 | 04:52 AM

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించిన ‘బేబి’ చిత్రం ఐదు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు గెలుచుక్ను సందర్భంగా సోమవారం యూనిట్‌ సభ్యులు...

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించిన ‘బేబి’ చిత్రం ఐదు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు గెలుచుక్ను సందర్భంగా సోమవారం యూనిట్‌ సభ్యులు మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమానికి దర్శకుడు మారుతి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ‘అవార్డ్స్‌ అంటే స్టార్స్‌ సినిమాలకే వస్తాయనే అపోహ తొలగిపోయిన సందర్భం ఇది. మా సినిమాకు ఐదు అవార్డులు రావడం ఆనందంగా ఉంది’ అన్నారు నిర్మాత ఎస్‌.కె.ఎన్‌. ఎనిమిది నామినేషన్స్‌కు ఐదు అవార్డులు రావడం సంతోషంగా ఉందని దర్శకుడు సాయిరాజేశ్‌ చెప్పారు. రచయిత అనంత్‌ శ్రీరామ్‌కు తప్ప తమ అందరికీ ఇదే మొదటి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అని ఆయన చెప్పారు. ‘ఉత్తమ నటిగా అవార్డ్‌ అందుకోవడం, మా ‘బేబి’ చిత్రానికి ఐదు అవార్డులు రావడం చాలా హ్యాపీగా ఉంది’ అన్నారు హీరోయిన్‌ వైష్ణవి చైతన్య.

Updated Date - Aug 06 , 2024 | 04:52 AM