ఒకే రోజు.. రెండు చిత్రాలు!
ABN , Publish Date - Aug 20 , 2024 | 02:42 AM
సాధారణంగా ఒక హీరో నటించిన రెండు సినిమాలు, ఒక దర్శకుడు తెరకెక్కించిన రెండు సినిమాలూ ఒకే రోజు విడుదలైన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు రష్మిక మందన్న విషయంలో ఆలాంటి పరిస్థితే...
సాధారణంగా ఒక హీరో నటించిన రెండు సినిమాలు, ఒక దర్శకుడు తెరకెక్కించిన రెండు సినిమాలూ ఒకే రోజు విడుదలైన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు రష్మిక మందన్న విషయంలో ఆలాంటి పరిస్థితే రిపీట్ అవుతోంది. ఆమె కథానాయిక పాత్రను పోషిస్తున్న ‘పుష్ప 2’ సినిమా డిసెంబరు 6న విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే. అలాగే అదే రోజున రష్మిక నటిస్తున్న మరో చిత్రం ‘ఛావా’ కూడా విడుదలవుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. విక్కీ కౌశల్ కథానాయకుడిగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. ‘పుష్ప’ చిత్రం ఉత్తరాదిలో కూడా పెద్ద హిట్ కావడంతో ‘పుష్ప2’ కోసం ఆక్కడి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా విడుదలయ్యే రోజే ‘ఛావా’ చిత్రం కూడా విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. నిజంగానే ఈ పోటీ ఉంటుందా లేక ‘ఛావా’ వెనక్కి వెళుతుందా అనేది వేచి చూడాలి