ఒకరు మోసం చేశారు.. మరొకరు సినిమాలు మానుకోమన్నారు

ABN , Publish Date - Nov 24 , 2024 | 01:07 AM

‘‘నా తొలి ప్రేమ పూర్తిగా నమ్మకంపైనే నడిచింది. నేనో వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. అతను కూడా నన్ను అలానే ప్రేమిస్తున్నాడని అనుకున్నా. కానీ అది నిజం కాదని తర్వాత తెలిసింది...

‘‘నా తొలి ప్రేమ పూర్తిగా నమ్మకంపైనే నడిచింది. నేనో వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. అతను కూడా నన్ను అలానే ప్రేమిస్తున్నాడని అనుకున్నా. కానీ అది నిజం కాదని తర్వాత తెలిసింది. ఆ తర్వాత మరో వ్యక్తితో ప్రేమలో పడ్డాను. అయితే ఆయన ఏకంగా నన్ను సినిమాల నుంచే వైదొలగాలని షరతు పెట్టాడు. అందుకు అంగీకరించినా మా బంధం ముందుకు వెళ్లలేదు’ అని నయనతార చెప్పారు. ‘బియాండ్‌ ద ఫేరీ టేల్‌’ డాక్యుమెంటరీతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చారు నయనతార. గతంలో తన విఫల ప్రేమ గురించి ఈ డాక్యుమెంటరీలో ఆమె తొలిసారి స్పందించారు. ‘నా ప్రేమ వ్యవహారాల్లో అసలేం జరిగింది అనేది నేను బయటపెట్టకపోవడంతో నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎవరికి తోచినట్లు వారు రాశారు. సమాజం అబ్బాయిల్ని ప్రశ్నించకుండా నన్ను మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తోంది? బహుశా నేను మనుషులను అతిగా నమ్మాననుకుంటా’’ అని నయనతార పేర్కొన్నారు. అయితే తన మాజీ ప్రియుల పేర్లను మాత్రం నయనతార వెల్లడించలేదు. ఇదే డాక్యుమెంటరీలో నాగార్జున మాట్లాడుతూ ‘‘బాస్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో నయనతార ఫోన్‌ మోగితే చాలు.. చాలా డల్‌ అయిపోయేవారు’’ అని చెప్పారు.

Updated Date - Nov 24 , 2024 | 01:07 AM