మెగాస్టార్‌తో మరోసారి?

ABN , Publish Date - May 21 , 2024 | 06:17 AM

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంతో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ...

మెగాస్టార్‌తో మరోసారి?

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంతో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం వేసిన భారీ సెట్‌లో యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లోనే పాటలు కూడా చిత్రీకరిస్తారని సమాచారం. జులై కల్లా షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ ప్రారంభించి, సంక్రాంతికి సినిమాను సిద్ధం చేయాలని నిర్మాతల ప్లానింగ్‌. ‘విశ్వంభర’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ తదుపరి చిత్రం మీద దృష్టి పెట్టారు చిరంజీవి. ఆయన కుమార్తె సుస్మిత నిర్మించే ఈ సినిమాకు కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహిస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమా గురించి వివరాలు ఏమీ బయటకు రాలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను దర్శకుడు మోహన్‌రాజాకు అప్పగించినట్లు చెబుతున్నారు. మెగాస్టార్‌ హీరోగా రూపొందిన ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. మోహన్‌రాజా స్ర్కిప్ట్‌ నేరేషన్‌ ఇచ్చారనీ, మెగాస్టార్‌ దాన్ని ఓకే చేశారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అదికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు.

Updated Date - May 21 , 2024 | 06:17 AM