మట్కా కోసం మరోసారి

ABN , Publish Date - Oct 15 , 2024 | 12:16 AM

ఎన్టీఆర్‌ నటించిన ‘టెంపర్‌’ సినిమాలో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ అనే పాటలో స్టెప్పులతో రెచ్చిపోయే.. ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరి’ పాటలో తన వయ్యారాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు ఐటెం సాంగ్స్‌ ...

ఎన్టీఆర్‌ నటించిన ‘టెంపర్‌’ సినిమాలో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ అనే పాటలో స్టెప్పులతో రెచ్చిపోయే.. ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరి’ పాటలో తన వయ్యారాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు ఐటెం సాంగ్స్‌ స్పెషలిస్ట్‌ నోరా ఫతేహి. తెలుగులో లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఆమె, వరుణ్‌తేజ్‌ నటిస్తున్న ‘మట్కా’ సినిమాలో సోఫియాగా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాలోని ‘లేలే రాజా’ అనే రెట్రో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటలో వరుణ్‌తేజ్‌ను ఆకట్టుకోవడానికి ఓ బార్‌లో ఆమె వేసిన స్టెప్పులు అలరించేలా ఉన్నాయి. భాస్కరభట్ల పాటను రచించగా, నీతి మోహన్‌ ఆలపించారు. జీ.వీ.ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందించారు. కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నవంబరు 14న విడుదలవుతోంది.

Updated Date - Oct 15 , 2024 | 12:16 AM