Movie Artists Association (MAA) : మరోసారి ‘మా’ అధ్యక్షుడిగా

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:08 AM

మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) అధ్యక్ష పదవిలో మంచు విష్ణు తాత్కాలికంగా మరి కొంతకాలం కొనసాగ నున్నారు. ఈ మేరకు ఆదివారంనాడు జరిగిన జనరల్‌ బాడీ సమావేశంలో ఒక నిర్ణయం...

Movie Artists Association (MAA) : మరోసారి ‘మా’ అధ్యక్షుడిగా

మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) అధ్యక్ష పదవిలో మంచు విష్ణు తాత్కాలికంగా మరి కొంతకాలం కొనసాగ నున్నారు. ఈ మేరకు ఆదివారంనాడు జరిగిన జనరల్‌ బాడీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నామని ‘మా’ ఉపాధ్యక్షులు మాదాల రవి తెలియజేశారు.

‘మా’ అసోసియేషన్‌ ఫండ్‌ రైజింగ్‌ కోసం జూలైలో మలేసియాలో ఒక ఈవెంట్‌ నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ‘మా’ కోసం ప్రత్యేక భవంతిని నిర్మించడానికి సన్నాహాలు ప్రారంభించామని, అప్పటి వరకు మంచు విష్ణుని అధ్యక్షుడుగా ప్రస్తుతం ఉన్న కార్యవర్గం సహా కొనసాగాలని జనరల్‌ బాడీ తీర్మానించిందని ఆయన తెలియజేశారు. 2021 అక్టోబర్‌లో జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌పై విష్ణు గెలుపొందారు. రెండేళ్లకోసారి ‘మా’ ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ ప్రకారం గతేడాది సెప్టెంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఈ ఏడాది మే నెలకు కమిటీ ఎన్నికలను వాయిదా వేశారు. ఇంకో నెలలో ఎన్నికలకు సిద్ధమవ్వాల్సిన తరుణంలో ‘మా’ జనరల్‌ బాడీ ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - Apr 08 , 2024 | 01:08 AM