మరోసారి జంటగా
ABN , Publish Date - Aug 19 , 2024 | 04:49 AM
హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న శివాజీ, లయ జంటగా సరికొత్త క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపొందుతోంది. సుధీర్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు...
హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న శివాజీ, లయ జంటగా సరికొత్త క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపొందుతోంది. సుధీర్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శివాజీ నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. దిల్‌రాజు క్లాప్ ఇవ్వగా, బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తామని యూనిట్ తెలిపింది.