అక్టోబర్‌లో సెట్స్‌పైకి

ABN , Publish Date - May 22 , 2024 | 12:49 AM

సీక్వెల్స్‌...ఇప్పుడు బాలీవుడ్‌లో నడుస్తోన్న ట్రెండ్‌. త్వరలో మరో సీక్వెల్‌ చిత్రం బాలీవుడ్‌లో పట్టాలెక్కనుంది. 1997లో వచ్చిన బాలీవుడ్‌ వార్‌ డ్రామా ‘బోర్డర్‌’. ఆ తరం ప్రేక్షకులను...

అక్టోబర్‌లో సెట్స్‌పైకి

సీక్వెల్స్‌...ఇప్పుడు బాలీవుడ్‌లో నడుస్తోన్న ట్రెండ్‌. త్వరలో మరో సీక్వెల్‌ చిత్రం బాలీవుడ్‌లో పట్టాలెక్కనుంది. 1997లో వచ్చిన బాలీవుడ్‌ వార్‌ డ్రామా ‘బోర్డర్‌’. ఆ తరం ప్రేక్షకులను అమితంగా అలరించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సన్నీడియోల్‌ కథానాయకుడిగా నటించారు. దేశభక్తి, సరిహద్దుల్లో సైనికుల త్యాగాలు, వారి కుటుంబాలు పడే తపన లాంటి అంశాలను హృద్యంగా చిత్రీకరించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘బోర్డర్‌ 2’ తెరకెక్కుతోంది. ఇందులో సన్నీతో పాటు ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పూర్తయింది, అక్టోబర్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జేపీ దత్తా, నిధి దత్తా, భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 2026లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - May 22 , 2024 | 12:49 AM