‘వార్‌2’ సెట్స్‌లో

ABN , Publish Date - Apr 30 , 2024 | 06:34 AM

‘వార్‌2’ సెట్స్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో ట్రెండ్‌ అవుతూనే ఉన్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌. తాజాగా ఆయన ఆదివారం బాంద్రాలో బాలీవుడ్‌ స్టార్స్‌ ఏర్పాటు చేసిన...

‘వార్‌2’ సెట్స్‌లో

‘వార్‌2’ సెట్స్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో ట్రెండ్‌ అవుతూనే ఉన్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌. తాజాగా ఆయన ఆదివారం బాంద్రాలో బాలీవుడ్‌ స్టార్స్‌ ఏర్పాటు చేసిన పార్టీలో తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలసి సందడి చేశారు. ఈ పార్టీలో హృతిక్‌ రోషన్‌, రణబీర్‌ కపూర్‌, అలియా భట్‌, కరణ్‌ జోహార్‌ కూడా తళుక్కున మెరిశారు. అభిమానులతో తారక్‌ సెల్ఫీలు దిగారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌ అయ్యాయి.

Updated Date - Apr 30 , 2024 | 06:34 AM