సూపర్‌స్టార్‌ జయంతి నాడు

ABN , Publish Date - Apr 28 , 2024 | 05:46 AM

సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘హరోం హర’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు...

సూపర్‌స్టార్‌ జయంతి నాడు

సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘హరోం హర’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు యూనిట్‌ శనివారం తెలిపింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో సుధీర్‌బాబు చేతిలో వేలాయుధం ధరించి ఉగ్రంగా కనిపించారు. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో సుమంత్‌ జి నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక శర్మ కథానాయిక. సునీల్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: అరవింద్‌ విశ్వనాథన్‌

Updated Date - Apr 28 , 2024 | 06:30 AM