వినోదం పంచే ఓం భీమ్‌ బుష్‌

ABN , Publish Date - Mar 13 , 2024 | 03:43 AM

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ‘హుషారు’ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీహర్ష కొనుగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు...

వినోదం పంచే ఓం భీమ్‌ బుష్‌

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ‘హుషారు’ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీహర్ష కొనుగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ యూనివర్సిటీలో చదువుకున్న ముగ్గురు యువకులు ఓ గ్రామంలో గుప్త నిధుల కోసం చేసే అన్వేషణని వినోదభరితంగా ఇందులో చూపించాం. ‘ఓం భీమ్‌ బుష్‌’ అనేది ఓ మ్యాజికల్‌ ఫ్రేజ్‌. చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు సరదాగా ఈ మాట అంటుంటారు. అదే మా సినిమాకు టైటిల్‌గా నిర్ణయించాం. కథకు యాప్ట్‌ టైటిల్‌ ఇది’ అన్నారు. ‘ఈ కథలో ప్రతి సన్నివేశం లాజిక్‌తో ముడిపడి ఉంటుంది. ఇందులో బలమైన కథ ఉంది. మంచి ఎమోషన్‌ కూడా ఉంది. ఇండియన్‌ స్ర్కీన్‌ మీద ఇప్పటివరకూ రాని పాయింట్‌ మా సినిమాలో ఉంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశాను’ అన్నారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు విశ్వరూపం చూస్తారని చెబుతూ ‘ఇందులో కామెడీ టైమింగ్‌ నెక్స్ట్‌ లెవల్‌లో ఉంటుంది. శ్రీవిష్ణు ఇంత పుల్‌ లెంగ్త్‌ కామెడీ ఇప్పటివరకూ చేయలేదు. ఫస్ట్‌ షాట్‌ నుంచి చివరి వరకూ ఓ లాఫ్‌ రైడ్‌లో ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’ అని చెప్పారు శ్రీహర్ష. చిత్ర నిర్మాతలు గురించి చెబుతూ ‘వంశీ, విక్రమ్‌, సునీల్‌ ఈ సినిమా నిర్మించారు. నాకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. ఇలాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. బిజినెస్‌ కూడా పెద్ద రేంజ్‌లో జరిగింది. తప్పకుండా మ్యాజిక్‌ క్రియేట్‌ చేస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు శ్రీహర్ష.

Updated Date - Mar 13 , 2024 | 03:43 AM