Tillu Square : ‘ఓ మై లిల్లీ’

ABN , Publish Date - Mar 19 , 2024 | 04:06 AM

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టిల్లు ేస్క్వర్‌’. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 29న ఈ చిత్రం...

Tillu Square : ‘ఓ మై లిల్లీ’

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టిల్లు ేస్క్వర్‌’. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదలవుతోంది. సోమవారం ఈ చిత్రం నుంచి థర్డ్‌ సింగిల్‌ ‘ఓ మై లిల్లీ’ అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మల్లిక్‌ రామ్‌ మాట్లాడుతూ ‘‘ఓ మై లిల్లీ పాట మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్‌ కావడంతో ఈ సినిమా మొదలైనప్పుడే ఎంతో బాధ్యత, ఒత్తిడి ఉందని అర్థమైంది. మీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను’’ అని అన్నారు. కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘డీజే టిల్లు చేేస సమయంలో ప్రేక్షకుల్లో సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ ‘టిల్లు ేస్క్వర్‌’ పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా, మొదటి భాగాన్ని మించేలా సినిమాని రూపొందించాం. టిల్లు పాత్ర అలాగే ఉంటుంది. కానీ కథ మాత్రం వేరేలా ఉంటుంది’’ అని చెప్పారు. కథానాయిక అనుపమా పరమేశ్వరన్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్ర విడుదల కోసం మేము ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘‘మొదటి భాగంలాగే, ‘టిల్లు ేస్క్వర్‌’ కూడా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అని అన్నారు.

Updated Date - Mar 19 , 2024 | 04:06 AM