ఆయ్‌.. ఆగస్టులో వస్తున్నామండీ

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:53 AM

నార్నే నితిన్‌, నయన్‌ సారిక జంటగా నటించిన ‘ఆయ్‌’ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ సంస్థ జీఎ 2 పిక్చర్స్‌ నిర్మిస్తున్న...

ఆయ్‌.. ఆగస్టులో వస్తున్నామండీ

నార్నే నితిన్‌, నయన్‌ సారిక జంటగా నటించిన ‘ఆయ్‌’ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ సంస్థ జీఎ 2 పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాతో అంజి కె మణిపుత్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డిఫరెంట్‌ ప్రమోషనల్‌ కంటెంట్‌తో ఈ సినిమా ఇప్పటికే అందరినీ ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు బన్నీ వాసు, విద్యా కొప్పినీడి మాట్లాడుతూ ‘ఆగస్టు 15 గురువారం. ఆ తర్వాత రోజు నుంచి వీకెండ్‌ మొదలవుతుంది. ఇక సోమవారం రక్షా బంధన్‌. అందుకే ఆ డేట్‌ను ఎన్నుకున్నాం. గోదావరి బ్యాక్‌డ్రా్‌పతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ ఫన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో నార్నే నితిన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు’ అని చెప్పారు. అల్లు అరవింద్‌ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంగీతం: రామ్‌ మిర్యాల, సినిమాటోగ్రఫీ: సమీర్‌ కల్యాణి.

Updated Date - Jun 26 , 2024 | 05:53 AM