జూన్‌లో ‘ఓ.సి’ వినోదం

ABN , Publish Date - May 22 , 2024 | 12:44 AM

హరీశ్‌ బొంపెల్లి, మాన్య సలాడి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఓ.సి’. ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌కు హరీశ్‌బొంపెల్లి దర్శకుడు. బీవీఎస్‌ నిర్మాత. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది....

జూన్‌లో ‘ఓ.సి’ వినోదం

హరీశ్‌ బొంపెల్లి, మాన్య సలాడి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఓ.సి’. ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌కు హరీశ్‌బొంపెల్లి దర్శకుడు. బీవీఎస్‌ నిర్మాత. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. జూన్‌ 7న ‘ఓసి’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు యూనిట్‌ మంగళవారం ప్రకటించింది. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ ‘ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమకు వచ్చిన కొందరు యువకుల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఆసక్తి కరంగా ఉంటుంది. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’ అని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాకు ‘ఓ.సి’ అనే టైటిల్‌ పెట్టడానికి ఉన్న కారణం సినిమా చూస్తే తెలుస్తుంది’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి వంశీ ఎస్‌., అక్షర్‌ బ్యాండ్‌ సంగీతం అందించారు.

Updated Date - May 22 , 2024 | 12:44 AM