ఓ నాన్న కథ

ABN , Publish Date - Mar 11 , 2024 | 03:17 AM

కవిన్‌, అపర్ణ దాస్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పా...పా...’. మోనిక చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్‌, వీటీవీ గణేశ్‌ ముఖ్య పాత్రలు పోషించారు.. గణేశ్‌ కె బాబు దర్శకత్వంలో ఎమ్మెస్‌ రెడ్డి నిర్మించారు...

ఓ నాన్న కథ

కవిన్‌, అపర్ణ దాస్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పా...పా...’. మోనిక చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్‌, వీటీవీ గణేశ్‌ ముఖ్య పాత్రలు పోషించారు.. గణేశ్‌ కె బాబు దర్శకత్వంలో ఎమ్మెస్‌ రెడ్డి నిర్మించారు. గతేడాది తమిళంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌ గా నిలిచిన ‘దాదా’ మూవీని తెలుగులో ‘పా...పా...’గా డబ్బింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఽఇటీవల డైరెక్టర్‌ త్రినాధ రావు విడుదల చేశారు. నిర్మాత ఎమ్మెస్‌ రెడ్డి మాట్లాడుతూ ‘దాదా’ సినిమాని 50 రోజుల తర్వాత థియేటర్లో చూశాను, అప్పటికీ 70 శాతం ఆక్యుపెన్సీతో ఆడుతోంది. వెంటనే నచ్చి యుఎస్‌ లో ఉన్న నా ఫ్రెండ్స్‌కి కాల్‌ చేసి, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాను అని చెప్పా. దీంతో వాళ్లు ఈ సినిమాని తెలుగులో తీసుకొద్దామన్నారు. అతి త్వరలో ఈ సినిమాని మీ ముందుకు తీసుకువస్తున్నాము’’ అని అన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 03:17 AM