‘ఓ భామ అయ్యో రామ’

ABN , Publish Date - Apr 02 , 2024 | 05:53 AM

వైవిధ్యమైన చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్‌. ఆయన హీరోగా నటిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. మాళవిక మనోజ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రామ్‌ గోదాల దర్శకత్వం వహిస్తున్నారు...

‘ఓ భామ అయ్యో రామ’

వైవిధ్యమైన చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్‌. ఆయన హీరోగా నటిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. మాళవిక మనోజ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రామ్‌ గోదాల దర్శకత్వం వహిస్తున్నారు. హరీశ్‌ నల్లా, ప్రదీప్‌ తాళ్లు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని ప్రారంభించి టైటిల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా సుహాస్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడు మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు’’ అని తెలిపారు. ‘నువ్వు నేను’ ఫేమ్‌ నటి అనిత హస్సనందని మాట్లాడుతూ ‘‘నా సెకండ్‌ ఇన్నింగ్స్‌కు పర్‌ఫెక్ట్‌గా కుదిరిన చిత్రమిది’’ అని చెప్పారు. దర్శకుడు రామ్‌ గోదాల మాట్లాడుతూ ‘‘ఇదొక బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరి’’ అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు ప్రారంభం నుంచే మంచి పాజిటివ్‌ వైబ్‌ కనిపిస్తోంది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్‌రాజు, డైరెక్టర్స్‌ వశిష్ట, విజయ్‌ కనకమేడల, శైలేశ్‌ కొలను పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: భవీన్‌ ఎమ్‌.షా, సినిమాటోగ్రాఫర్‌: మణికందన్‌, సంగీతం: రథన్‌, కోప్రొడ్యూసర్‌: ఆనంద్‌ గడగోని.

Updated Date - Apr 02 , 2024 | 05:53 AM