O Andala Rakshasi: మరో ‘అందాల రాక్షసి’ రెడీ అవుతోంది
ABN , Publish Date - Oct 26 , 2024 | 10:45 PM
‘అందాల రాక్షసి’, ‘నేను నా రాక్షసి’ తర్వాత మరో ‘అందాల రాక్షసి’ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ ఇటు తెలుగు, అటు తమిళ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తున్నారు. షెరాజ్ మెహదీ ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ముందుకు ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి రాబోతున్నారు. ఈ చిత్ర విశేషాలను చిత్రబృందం తెలియజేసింది.
‘అందాల రాక్షసి’, ‘నేను నా రాక్షసి’ తర్వాత మరో ‘అందాల రాక్షసి’ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ ఇటు తెలుగు, అటు తమిళ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తున్నారు. షెరాజ్ మెహదీ ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ముందుకు ‘ఓ అందాల రాక్షసి’ (O Andala Rakshasi) అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి రాబోతున్నారు. ఈ చిత్రంలో షెరాజ్ మెహదీ హీరోగా.. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ద లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మాతగా.. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షేర్ సమర్పణలో ఈ చిత్రం రాబోతోంది. ఓ అందమైన ప్రేమ కథా చిత్రంగా షెరాజ్ ‘ఓ అందాల రాక్షసి’ని రెడీ చేస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో
Also Read-Jani Master: భార్య, పిల్లలతో జానీ మాస్టర్.. ‘యానిమల్’ మూవీ పాటతో ఎమోషనల్ వీడియో
డైరెక్టర్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ షెరాజ్ మెహదీ మాట్లాడుతూ.. ‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు భాష్యశ్రీ కథ, మాటలు, పాటలు రాశారు. అలాగే స్క్రీన్‌ప్లేలో కూడా సపోర్ట్ చేశారు. ఆయన సహకారం వల్లే ఈ సినిమా ఇంత బాగా చేయగలిగాం. భాష్యశ్రీ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ‘ఓ అందాల రాక్షసి’ సినిమా గ్లామర్ బేస్డ్ మూవీ కాదు. మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఒకరకంగా ఇది వుమెన్ ఓరియెంటెడ్ మూవీ అని అనుకోవచ్చు. మహిళల గురించిన అంశాలు ఉంటాయి. అమాయక మహిళలు కొందరి చేతిలో ఎలా మోసపోతున్నారు అనేది సినిమాలో చూపిస్తున్నాం. అలాగే మోసం చేసేవారికి శిక్ష కూడా ఉంటుందని చెబుతున్నాం. సుమన్, తమ్మారెడ్డి భరద్వాజ వంటి సీనియర్స్ ఇందులో ఇంపార్టెంట్ రోల్స్‌లో నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే థియేటర్స్‌లో ప్రేక్షకులను కలుస్తామని అన్నారు.
Also Read-Nandamuri Balakrishna: తెలంగాణలో ‘బాలకృష్ణ ఫిలిం స్టూడియో’.. నిజమేనా?
రైటర్ భాష్యశ్రీ మాట్లాడుతూ.. ‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు నేను కథ, మాటలు, పాటలు రాశాను. మా డైరెక్టర్, హీరో షెరాజ్ మెహదీకి థ్యాంక్స్ చెబుతున్నా. ఆయన ఒక వర్సటైల్ పర్సన్. డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ హీరోగానూ నటించారు. ఆయన వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. 45 రోజుల షూటింగ్‌తో టాకీ, సాంగ్స్ కంప్లీట్ చేసుకున్నాం. హైదరాబాద్, గోవా, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ ఇది. గ్లామర్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా స్ట్రాంగ్ స్క్రిప్ట్ మీద వెళ్లాం. త్వరలోనే మీ ముందుకు మా ‘ఓ అందాల రాక్షసి’ సినిమాను తీసుకొస్తున్నాం. అందరికీ తప్పకుండా నచ్చే సినిమా ఇదని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్లు విహాన్షి హెగ్డే, నేహా దేశ్‌పాండే ప్రసంగించారు.