కల్కి బృందానికి నోటీసులు

ABN, Publish Date - Jul 21 , 2024 | 01:44 AM

‘కల్కి 2898 ఏ.డీ’ మేకర్స్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఈ సినిమాలో నటించిన ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, ఇతర నటులతో పాటు మేకర్స్‌కు మాజీ కాంగ్రెస్‌ నాయకుడు, కల్కి ధామ్‌ పీఠాధిపతి ఆచార్య ప్రసాద్‌ లీగల్‌ నోటీసులు పంపారు...

‘కల్కి 2898 ఏ.డీ’ మేకర్స్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఈ సినిమాలో నటించిన ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, ఇతర నటులతో పాటు మేకర్స్‌కు మాజీ కాంగ్రెస్‌ నాయకుడు, కల్కి ధామ్‌ పీఠాధిపతి ఆచార్య ప్రసాద్‌ లీగల్‌ నోటీసులు పంపారు. ‘‘ఈ సినిమా భారతీయ ఇతిహాసాల్లోని విశ్వాసాలను దెబ్బతీసేలా ఉంది. ఇందులో హిందూ పురాణాల్లో ఉన్న విధంగా కాకుండా.. వాటిని వక్రీకరించారు. విష్ణుమూర్తి చివరి అవతారం ‘కల్కి’ని పవిత్ర గ్రంధాలను కించపరిచేలా చిత్రీకరించారు. ఇది దేశంలో కోట్లాది సంఖ్యలో ఉన్న భక్తులను అయోమయానికి, గందరగోళానికి గురిచేసేలా ఉంది’’ అని అచార్య ప్రసాద్‌ ఈ నోటీసులో ఆరోపించారు.

Updated Date - Jul 21 , 2024 | 01:44 AM