చిన్న సినిమా కాదు.. మంచి సినిమా

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:57 AM

యష్‌ పూరి, అపూర్వ రావ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హ్యాపీ ఎండింగ్‌’. కౌశిక్‌ భీమిడి దర్శకత్వంలో యోగేశ్‌ కుమార్‌, సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లాల నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదలవుతోంది...

చిన్న సినిమా కాదు.. మంచి సినిమా

యష్‌ పూరి, అపూర్వ రావ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హ్యాపీ ఎండింగ్‌’. కౌశిక్‌ భీమిడి దర్శకత్వంలో యోగేశ్‌ కుమార్‌, సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లాల నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు వేణు ఉడుగల చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్‌లో విక్కీ డోనర్‌లా తెలుగులో హ్యాపీఎండింగ్‌ చిత్రం కూడా మంచి విజయం అందుకోవాలని వేణు ఆకాంక్షించారు. యష్‌ పూరి మాట్లాడుతూ ‘మాది చిన్న సినిమా కాదు, మంచి సినిమా. కుటుంబం, స్నేహితులతో కలసి చూడాల్సిన చిత్రమిది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘హ్యాపీ ఎండింగ్‌’ నిజాయితీగా చేసిన ప్రయత్నం. పురాణాల్లో కొందరికి శాపాలు ఉంటాయి. అలాంటి శాపం హీరోకు ఉంటే ఎలా ఉంటుంది అనే పాయింట్‌తో తెరకెక్కింది. ప్రేక్షకులకు చక్కని వినోదం అందిస్తుంది’ అని చెప్పారు. ఒక అబ్బాయి కథే ఈ సినిమా, ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది అని అపూర్వారావ్‌ తెలిపారు.

Updated Date - Jan 21 , 2024 | 01:57 AM