ఈసారి కామెడీ కాదు.. సీరియస్సే

ABN , Publish Date - May 29 , 2024 | 06:43 AM

‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రంలో వినోదాత్మక పాత్రతో అలరించిన ‘అల్లరి’ నరేశ్‌ ఇప్పుడు ‘బచ్చల మల్లి’ చిత్రంలో మాస్‌ లుక్‌తో కనిపించనున్నారు. ‘సోలో బతుకే సో బెటర్‌’ చిత్రానికి...

ఈసారి కామెడీ కాదు.. సీరియస్సే

‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రంలో వినోదాత్మక పాత్రతో అలరించిన ‘అల్లరి’ నరేశ్‌ ఇప్పుడు ‘బచ్చల మల్లి’ చిత్రంలో మాస్‌ లుక్‌తో కనిపించనున్నారు. ‘సోలో బతుకే సో బెటర్‌’ చిత్రానికి దర్శకత్వం వహించిన సుబ్బు మంగాదేవి ఈ సినిమాకు దర్శకుడు. రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మాతలు. రిక్షా మీద కూర్చుని బీడీ తాగుతున్న నరేశ్‌ మాస్‌ లుక్‌ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో అమృత అయ్యర్‌ కథానాయిక. రోహిణి, రావు రమేశ్‌, అచ్యుత్‌ కుమార్‌, బలగం జయరామ్‌, హరితేజ, ప్రవీణ్‌, వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 1990 బ్యాక్‌ డ్రాప్‌లో తయారవుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. ఈ చిత్రానికి కథ, మాటలు: సుబ్బు, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, ఫొటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌, ఎడిటింగ్‌: ఛోటా కె ప్రసాద్‌, స్ర్కీన్‌ప్లే: విప్పర్తి మధు

Updated Date - May 29 , 2024 | 06:44 AM