కమెడియన్‌ కాదు కామిక్‌ యాక్టర్‌

ABN , Publish Date - Feb 21 , 2024 | 03:51 AM

హీరో రవితేజ, సుధీర్‌ కుమార్‌ కుర్రుతో కలసి నిర్మించిన చిత్రం ‘సుందరం మాస్టర్‌’. హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కల్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం...

కమెడియన్‌ కాదు కామిక్‌ యాక్టర్‌

హీరో రవితేజ, సుధీర్‌ కుమార్‌ కుర్రుతో కలసి నిర్మించిన చిత్రం ‘సుందరం మాస్టర్‌’. హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కల్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలవుతోంది. చిత్రబృందం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘సుందరం మాస్టర్‌’ ట్రైలర్‌ చాలా బావుంది. హర్షను కమెడియన్‌ అనడం నాకు నచ్చదు. ఆయనో కామిక్‌ యాక్టర్‌. ఆయన కామెడీ టైమింగ్‌ అద్భుతం. కొత్తవాళ్లను ప్రోత్సహిస్తున్న రవితేజకు అభినందనలు’ అన్నారు. హర్ష మాట్లాడుతూ ‘మా సినిమాకు చిరంజీవి గారు ఇచ్చిన మద్దతు మర్చిపోలేను. పదేళ్ల క్రితం ప్రేక్షకుల మధ్యలో ఉన్న నేను ఇప్పుడు ఇలా వేదికపై ఉన్నాను. మనం గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించగలం’ అన్నారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అవుతుందో తెలియదు కానీ మా అందరికీ గౌరవాన్ని తీసుకొస్తుంది అని దర్శకుడు చెప్పారు. హర్ష వల్లే మేం ఈ రోజు ఇక్కడ నిలబడగలిగాం, ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది అని సుధీర్‌ కుమార్‌ తెలిపారు.

Updated Date - Feb 21 , 2024 | 03:51 AM