నచ్చితే ఎక్కడికైనా వెళతా..
ABN , Publish Date - Aug 23 , 2024 | 06:30 AM
‘‘మనకు నచ్చిన వారి కోసం మనం తప్పకుండా నిలబడాలి. నాకు నచ్చినవారి కోసం ఎక్కడికైనా.. ఎంతదూరమైనా వెళతా.. ఏమైనా చేస్తా. ఈ మూవీ ఫంక్షన్ కోసం తబిత సుకుమార్ నన్ను పిలిచారు. అందుకే ‘పుష్ప 2’ క్టైమాక్స్
‘‘మనకు నచ్చిన వారి కోసం మనం తప్పకుండా నిలబడాలి. నాకు నచ్చినవారి కోసం ఎక్కడికైనా.. ఎంతదూరమైనా వెళతా.. ఏమైనా చేస్తా. ఈ మూవీ ఫంక్షన్ కోసం తబిత సుకుమార్ నన్ను పిలిచారు. అందుకే ‘పుష్ప 2’ క్టైమాక్స్ షూటింగ్‌లో ఉండి కూడా.. ఇక్కడికి వచ్చాను. ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ లాంటి సినిమాలు హిట్టవ్వాలి. ఇలాంటి మంచి కథలు ఉన్న చిత్రాలు మరిన్ని రావాలి అని కోరుకుంటున్నాను’’ అని అల్లు అర్జున్ అన్నారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రావురమేశ్, అంకిత్ కొయ్య, ఇంద్రజ, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్ చిత్రాన్ని సమర్పించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, సుకుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సుకుమార్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాను చూశాను. చాలా బాగుంది’’ అని చెప్పారు. ‘‘సినిమా అనుకున్నదానికంటే బాగా వచ్చింది. ఇది టీమ్ ఎఫర్ట్’’ అని దర్శకుడు లక్ష్మణ్ కార్య అన్నారు.