నో లాజిక్‌ ఓన్లీ మ్యాజిక్‌

ABN , Publish Date - Feb 23 , 2024 | 03:46 AM

శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కలయికలో వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ చిత్రం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌ సెట్టయింది. ఈ చిత్రానికి ‘ఓం భీమ్‌ బుష్‌’ అనే...

నో లాజిక్‌ ఓన్లీ మ్యాజిక్‌

శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కలయికలో వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ చిత్రం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌ సెట్టయింది. ఈ చిత్రానికి ‘ఓం భీమ్‌ బుష్‌’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. ‘నో లాజిక్‌ ఓన్లీ మ్యాజిక్‌’ అనేది ఉపశీర్షిక. ‘హుషారు’ ఫేమ్‌ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో వీ సెల్యూలాయిడ్‌తో కలసి సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సమర్పిస్తోంది. గురువారం మేకర్స్‌ ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి, మార్చి 22న సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రీతీ ముకుందన్‌, అయేషాఖాన్‌ కథానాయికలు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎంఆర్‌. సినిమాటోగ్రఫీ: రాజ్‌ తోట

Updated Date - Feb 23 , 2024 | 03:46 AM