నాదీ గ్యారంటీ
ABN , Publish Date - Oct 29 , 2024 | 02:00 AM
హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా ‘క’. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లు. ఈ నెల 31న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కిరణ్ మీడియాతో మాట్లాడారు...
హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా ‘క’. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లు. ఈ నెల 31న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కిరణ్ మీడియాతో మాట్లాడారు. ‘క సినిమా టైటిల్ జస్టిఫికేషన్ నా పేరు కాదు, టైటిల్ అలా కుదిరింది. దర్శకులు సందీప్, సుజీత్ కథ చెప్పినప్పుడు నెక్ట్స్ ఏం జరుగుతుందనేది ఊహించలేకపోయాను. నేను ఇలా జరుగుతుందేమో అనుకుంటే మరో ట్విస్ట్ వచ్చింది. ఇలాంటి పాయింట్‌తో 70వ దశకం నేపథ్యంలో కొత్తగా మూవీ ప్లాన్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ కలిగింది. దర్శకులు చెప్పిన షాట్ మేకింగ్ కూడా కొత్తగా అనిపించింది. ప్రేక్షకులు ఈ కథను తప్పకుండా బాగా రిసీవ్ చేసుకుంటారని నమ్మాం. క్లైమాక్స్‌ను కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాం.
ఇలాంటి క్లైమాక్స్‌తో ఇంతవరకు ఏ మూవీ రాలేదు. క్లైమాక్స్‌ని కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాం. అది జెన్యూన్‌గా ప్రేక్షకులకు రీచ్ అవుతుందని నమ్ముతున్నాం. అందుకు నాదీ గ్యారంటీ’ అని చెప్పారు కిరణ్ అబ్బవరం.