నో అన్నా వాళ్లు వదల్లేదు!

ABN , Publish Date - Oct 18 , 2024 | 12:46 AM

రాజ్‌ అండ్‌ డీకే దర్వకత్వంలో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌ ‘హనీ బన్నీ’. సమంత, వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. నవంబరు 7 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవనుంది...

రాజ్‌ అండ్‌ డీకే దర్వకత్వంలో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌ ‘హనీ బన్నీ’. సమంత, వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. నవంబరు 7 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవనుంది. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘దర్శకులు నన్ను ఈ సిరీస్‌ కోసం సంప్రదించారు. అయితే నా అనారోగ్య కారణాల రీత్యా నటించలేనని చెప్పాను. అందుకు బదులుగా ఈ పాత్రకు సరిపోయే నలుగురు హీరోయిన్ల పేర్లను కూడా రాజ్‌ అండ్‌ డీకే కి సిఫార్సు చేశాను. అయినా వాళ్లు పట్టుబట్టి నా కోసం వెయిట్‌ చేశారు’ అని తెలిపారు.

Updated Date - Oct 18 , 2024 | 12:46 AM