నిన్ను కన్న కనులే

ABN , Publish Date - Jul 19 , 2024 | 02:08 AM

తమిళ చిత్రకథానాయకుడు విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ మొదలయ్యాయి. సినిమాలోని రెండో పాట ‘నిన్ను కన్న కనులే’ను...

తమిళ చిత్రకథానాయకుడు విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ మొదలయ్యాయి. సినిమాలోని రెండో పాట ‘నిన్ను కన్న కనులే’ను గురువారం విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ ఫ్యామిలీ సాంగ్‌ను యువన్‌ శంకర్‌రాజా, ఎస్పీ చరణ్‌, చిత్ర పాడారు. విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్‌, ప్రభుదేవా, మోహన్‌, జయరామ్‌, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి తదితరులు ఇతర ముఖ్య తారాగణం. కల్పాతి ఎస్‌ అఘోరమ్‌, కల్పాతి ఎస్‌.గణేశ్‌, ఎస్‌.సురేశ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. వెంకట్‌ ప్రభు దర్శకుడు.

Updated Date - Jul 19 , 2024 | 02:08 AM