నిఖిల్ వలపు గీతం
ABN , Publish Date - Oct 18 , 2024 | 12:44 AM
‘స్వామి రారా’, ‘కేశవ’ చిత్రాల తర్వాత హీరో నిఖిల్ సిద్దార్థ, దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. కన్నడ క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా...
‘స్వామి రారా’, ‘కేశవ’ చిత్రాల తర్వాత హీరో నిఖిల్ సిద్దార్థ, దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. కన్నడ క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘హే తార’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. కృష్ణ చైతన్య రాసిన ఈ పాటను కార్తీక్, నిత్యశ్రీ పాడారు. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను తెలుపుతూ ఈ పాట సాగింది. నవంబర్ 8న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ చెప్పారు.