దీపావళికి రానున్న నిఖిల్
ABN , Publish Date - Oct 07 , 2024 | 03:40 AM
హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణీ వసంత్ కథానాయిక. బి.వి.ఎ్‌స.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు....
హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణీ వసంత్ కథానాయిక. బి.వి.ఎ్‌స.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు ‘‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో సినిమాను దీపావళికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎడిటర్: నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్. కాగా, సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ ‘స్వామిరారా’, ‘కేశవ’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.