నిహారిక కమిటీ కుర్రోళ్లు

ABN , Publish Date - Apr 10 , 2024 | 01:44 AM

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల సమర్పణలో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఉగాది సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను హీరో సాయిదుర్గా తేజ్‌ విడుదల చేసి...

నిహారిక కమిటీ కుర్రోళ్లు

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల సమర్పణలో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఉగాది సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను హీరో సాయిదుర్గా తేజ్‌ విడుదల చేసి యూనిట్‌కు అభినందనలు తెలిపారు. నిహారిక మాట్లాడుతూ ‘మా పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న తొలి చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’, దామోదర్‌ స్టూడియోస్‌ సంస్థతో కలసి నిర్మిస్తున్నా. కొత్తవాళ్లతో ఈ సినిమా చేయడం బాధ్యతగా భావిస్తున్నా’ అన్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న యదు వంశీ మాట్లాడుతూ ‘పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లను పరిచయం చేస్తున్నాం. వినోదభరితంగా ఈ సినిమా ఉంటుంది’ అని చెప్పారు. కొత్త నటీనటులతో పాటు సాయికుమార్‌, గోపరాజు రమణ, బలగం జయరామ్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్‌ దేవ్‌, ఫొటోగ్రఫీ: రాజు ఎడురోలు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మన్యం రమేశ్‌, నిర్మాతలు: పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక.

Updated Date - Apr 10 , 2024 | 01:44 AM