పుట్టినరోజున కొత్త కబురు

ABN , Publish Date - May 21 , 2024 | 06:18 AM

మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌, ఫ్యాన్‌ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానిని దృష్టిలో ఉంచుకుని తన సినిమాల ఎంపిక ఎంతో...

పుట్టినరోజున కొత్త కబురు

మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌, ఫ్యాన్‌ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానిని దృష్టిలో ఉంచుకుని తన సినిమాల ఎంపిక ఎంతో కేర్‌ తీసుకుంటుంటారు ఎన్టీఆర్‌. ప్రస్తుతం అందరి దృష్టీ ఆయన చేస్తున్న ‘దేవర’, ‘వార్‌ 2’ చిత్రాల మీదే ఉంది. తాజాగా ఇప్పుడు మరో భారీ చిత్రాన్ని ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. ‘కేజీఎఫ్‌’, ‘సలార్‌’ చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాకు దర్శకుడు కావడం విశేషం. ‘ఎన్టీఆర్‌ నీల్‌’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపుదిద్దుకొనే ఈ చిత్రం షూటింగ్‌ ఆగస్టులో ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.


ఎన్టీఆర్‌ స్టార్‌ వవర్‌, ప్రశాంత్‌ నీల్‌ విజనరీతో రూపుదిద్దుకొనే ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కేజీఎఫ్‌’కు దీటుగా భారీ స్కేల్‌లో ఉంటూ ఇండస్ట్రీలో సరికొత్త బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేస్తుందంటున్నారు నిర్మాతలు. ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘దేవర’, ‘వార్‌ 2’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేసి ఆగస్టు నుంచి ప్రశాంత్‌ నీల్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.

Updated Date - May 21 , 2024 | 06:18 AM